రైతు చేతికి రద్దునోట్లు

5 Dec, 2016 02:09 IST|Sakshi
రైతు చేతికి రద్దునోట్లు

ధాన్యం కొనకముందే చెల్లింపులు
పెద్దపల్లి జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ

 
పెద్దపల్లి : వ్యాపారులు, మిల్లర్లు తమ వద్ద ఉన్న రద్దు నోట్లతో వరిధాన్యం కొనుగోలు చేసి సర్కారు నిఘా నుంచి తప్పించుకున్నారు. రైతులు మార్కెట్‌కు వెళ్లి ధాన్యం విక్రరుుంచడం కంటే, తమ వద్దకు వచ్చిన వ్యాపారి వద్ద రద్దు నోట్లు తీసుకుని విక్రయాలను పూర్తి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 రోజుల్లో వ్యాపారుల నుంచి రైతులకు సుమారు రూ.100 కోట్ల రద్దు నోట్లు ముట్టినట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, సిద్దిపేట, మానకొండూర్ తదితర ప్రాంతాలకు చెందిన రైస్‌మిల్లుల యజమానులు రైతుల నుంచి ఈ ప్రాం తంలో పెద్ద మొత్తంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు.

అరుుతే రైతులకు గతంలోకంటే ఈసారి వేగవంతంగా డబ్బులు చేతికందారుు. ధాన్యం మిల్లుకు చేరిన 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ధాన్యం డబ్బులు రైతుకు అందేవి. అలాగే ప్రభుత్వం సేకరిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. చెక్కులు తీసుకుని బ్యాంకులో జమ చేసుకోవడం, ఆ తర్వాత బ్యాంకు ద్వారా విత్‌డ్రా చేసుకోవడం ప్రహాసనంగా మారింది. దీనికంటే వ్యాపారి నుంచి వస్తున్న రద్దు నోట్లు తీసుకోవడం, కొంత అవసరాల కోసం చలామణి చేసుకోవడం, మిగిలిన సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్నారు.

నమ్మకస్తులకు ముందే డబ్బు..
గ్రామాల్లో ఉన్న నమ్మకమైన రైతులకు వ్యాపారులు ముందే డబ్బును ముట్టజెబుతున్నారు. తూకం వేయడం కంటే ముందే డబ్బు ఇచ్చి, ఆ తర్వాత మిల్లర్ ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ఇదే పద్ధతిలో ప్రతి గ్రామంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేరకు చలామణీ అయ్యా రుు. ఇటు రద్దు నోట్లు మార్పిడి చేసుకోవడం వ్యాపారికి ఇబ్బంది కాగా.. అనుకున్న సమయంకంటే ముందే తమచేతికి ఏదో ఒక నోటు రావడం రైతుకు కూడా సంతోషంగానే మారిం ది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా రద్దు నోట్ల న్నీ రైతుల జేబుల్లోకి చేరుకున్నారుు. అలాగే వ్యాపారి సైతం తాను ఎలాంటి కష్టం లేకుం డానే నోట్లన్నీ రైతులకు పంపిణీ చేసి పని పూర్తి చేసుకున్నారు. దీంతో వడ్ల సేకరణ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండానే నోట్ల పంపిణీ కూడా పూర్తరుుంది.

మిల్లులకు చేరిన వరిధాన్యం
పెద్దపల్లి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు కూ డా ఈ ప్రాంతం నుంచి ధాన్యం తరలిపోరుుం ది. ఉద్దెర, ఇబ్బంది లేకుండానే ధాన్యం కొనుగోళ్లన్నీ పూర్తయ్యారుు. కొన్ని చోట్ల రైతులకు అడ్వాన్‌‌స ముట్టినట్లు సమాచారం. ఆరోపణలు, అనుమానాలు లేకుండా పూర్తరుున కొనుగోళ్ల పై ఇటు అధికారుల దృష్టి కూడా పడలేదు. రైతులు నోట్ల గొడవలో అంతా తమకు మంచే జరిగిందని సంతోషం వ్యక్తం చేసినా మళ్లీ డబ్బులు పొందేందుకు మాత్రం బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పడం లేదు.

మరిన్ని వార్తలు