హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ

10 Sep, 2016 00:05 IST|Sakshi
రొంపిచెర్లలో కొవ్వొతులతో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు
 
రొంపిచెర్ల: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రొంపిచెర్లలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వసీం అక్రం వూట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవిని కాదని సీఎం చంద్రబాబు చెప్పడం సబబు కాదన్నారు. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్యను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రవుంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు అలీ, నిషార్‌ అహ్మద్, బరకత్, షాజహాన్, వుుజీబ్, ప్రకాష్, రవి పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు