అదుపుతప్పి దూసుకువెళ్లిన కారు

14 Aug, 2016 00:33 IST|Sakshi
అదుపుతప్పి దూసుకువెళ్లిన కారు
ఉల్లిపాలెం(కోడూరు):
 పుష్కర స్నానం చేసి తిరిగి వెళ్తున్న భక్తుల అంబాసిడర్‌ కారు అదుపు తప్పింది. కల్వర్టుపై కూర్చున్న వారిపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన దాసరి వెంకటరమణయ్య(60), కోట ముక్తేశ్వరరావు, పుప్పాల కోటేశ్వరరావు కల్వర్టుపై కూర్చున్నారు. కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఘటనలో వెంకటరమణయ్య పక్కనే డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు. ముకేశ్వరరావుకి ఒక కాలు విరిగిపోయింది. కోటేశ్వరరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారులో మొవ్వ గ్రామానికి చెందిన పోలిశెట్టి సుధారాణి, కుటుంబసభ్యులు విజయనాగదుర్గ, తరుణి, గుంటూరుకు చెందిన గనిపిశెట్టి రమాదేవి, మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.  
బాధితులకు అండగా రమేష్‌బాబు..
మృతుడు వెంకటరమణయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు శనివారం రాత్రి రాస్తారోకోకు దిగారు. రమణయ్య మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అవనిగడ్డ సీఐ మూర్తి మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసిన తరువాత మృతదేహాన్ని తీస్తాం.. అంటూ ఆందోళకారులు చెప్పారు. సీఐ మూర్తి ఎంపీపీ మాచర్ల భీమయ్య, డీసీ మాజీ అధ్యక్షుడు గుడిసేవ సూర్యనారాయణకు వారికి నచ్చజెప్పాలని కోరారు. వారు నిరాకరించడంతో సీఐ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ  విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. వారు పుష్కర విధుల్లోని 150మంది పోలీసులను పంపారు.  పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి విచక్షణరహితంగా కొట్టారు.  బాధితులకు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అండగా నిలిచారు.  సీఐ సరిగ్గా సమాధానం చెప్పడంతోఅసహనం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారు.
 
మరిన్ని వార్తలు