కోళ్లఫారంలో పేకాట.. 21.77 లక్షలు స్వాధీనం

26 Sep, 2016 23:40 IST|Sakshi
టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలీసుల దాడి.. 32 మంది అరెస్టు
  • టి.నరసాపురం :
        పశ్చిమగోదావరి జిల్లా బండివారిగూడెంలో ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి టి.నరసాపురం పోలీసులు దాడి చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ముగ్గురు, ఆంధ్రాలోని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, తాడేపల్లిగూడేలకు చెందిన 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.21,77,095 స్వాధీనం చేసుకున్నారు. టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారి సూచనల మేరకు చింతలపూడి ఎస్‌ఐ సైదానాయక్, జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్‌ఐ ఎ.ఆనందరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. టి.నరసాపురం పోలీసులకు సహకరించారు. పెద్దఎత్తున జరుగుతున్న పేకాట శిబిరం గుట్టురట్టు చేసినందుకు టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ను, సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అభినందించారు. ఈ జూదరులంతా జిల్లాలో రోజుకొక ప్రదేశాన్ని ఎంచుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆదివారం టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసినట్టు ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు