పొగాకు సాగులో జాగ్రత్తలు పాటించాలి

12 Dec, 2016 14:55 IST|Sakshi
పొగాకు సాగులో జాగ్రత్తలు పాటించాలి
  •  రీజినల్‌ మేనేజర్‌ రత్నసాగర్‌
  • మర్రిపాడు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొగాకు రైతులు సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని భారత పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ రత్నసాగర్‌ పేర్కొన్నారు.  డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో 3,992 మంది రైతులకు పొగాకు పండించేందుకు 3,180 బ్యారెన్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను 7,683 హెక్టార్లలో నాట్లు వేసేందుకు బోర్డు అనుమతిని ఇచ్చిందని తెలిపారు. దాంట్లో 10.8 మిలియన్‌ కిలోల పొగాకు పండించాలని సూచించినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనీసం సగభాగం కూడా వేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 199 హెక్టార్లలో మాత్రమే పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు వేసిన 190 హెక్టార్లలో కూడా 60 హెక్టార్లలో మొక్కలన్ని మాడిపోయి చనిపోయాయని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 3130 హెక్టార్లలో పొగాకు నాట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు తడులు నీళ్లు కలిపి పొగాకు నాట్లు వేసినప్పటికీ దిగుబడి పెరిగే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. వేలం కేంద్రం పరిధిలో డీసీపల్లి, ఖాన్‌సాహెబ్‌పేట, బంట్లపల్లి, కోనసముద్రం, మర్రిపాడు గ్రామాల్లో తోటలను పరిశీలించారు. వారి వెంట క్షేత్రాధికారులు గిరిరాజ్‌కుమార్, బెనర్జీ, పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
మరిన్ని వార్తలు