మొక్కంటే.. ‘లెక్క’లేదు..

8 Jan, 2017 22:17 IST|Sakshi

నాటిన మొక్కలకు సంరక్షణ కరువు
 ఎండిపోతున్న వైనం..
 రక్షణ పేరిట నిధులు దుర్వినియోగం
 డివైడర్ల మధ్య మళ్లీ మొక్కలు నాటేందుకు నిధులు


మంచిర్యాల టౌన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం అమలుచేస్తోంది. భవిష్యత్తు సంక్షేమ దృష్ట్యా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ.. ఏం లాభం జిల్లాలకు వస్తే ఆ పరిస్థితి తారుమారు అవుతోంది. జిల్లాలో లక్షకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. గుంతలూ తవ్వారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. ఎక్కడ చూసినా మొక్కలు కనిపించడం లేదు. మొక్కల కోసం తవ్విన గుంతలు మాత్రం ఖాళీగా దర్శనమిస్తూ.. అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.

కనిపించని మొదటి విడత మొక్కలు..
మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలో హరితహారం అపహాస్యం పాలవుతోంది. గత ఏడాది నాటిన మొక్కలు ఎండిపోయి కనిపించకుండా పోగా.. ఈ ఏడాది లక్ష్యాన్ని పెంచి ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేసినా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటినట్లు కనిపించడం లేదు. మొదటి విడతలో నాటిన మొక్కలు ఎక్కడా   – మిగతా 2లోu కనిపించకుండా పోయాయి. దీంతో రెండో విడత లో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడమూ అంతే ముఖ్యమన్న నినాదం తో ముందు నుంచి ప్రభుత్వం రెండో విడత హరితహారానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో సమన్వయం చేయడంతో, నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగానే మొక్కలు నాటేందుకు ఉత్సాహం చూపారు. అం దుకు అనుగుణంగానే మున్సిపాలిటీ పరిధిలో మొ క్కలు నాటేందుకు గుంతలను సైతం తవ్వారు. మున్సిపాలిటీకి మొదట 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. మంచిర్యాల పోలీసులే పది వేలకు పైగా మొక్కలు నాటారు.

వీరికి తోడు మహిళా సంఘాల సభ్యులు 50 వేలకు పైగా మొ క్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపాలిటీ లక్ష్యాన్ని 1,13,417గా నిర్ణయించారు. అం దుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు మున్సిపల్‌ అధికారులు గుంతలు తవ్వారు. 1,36,542 మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. తవ్విన గుంతలే దర్శనమిస్తున్నాయి.   కానరాని ట్రీగార్డులు : మొక్కలను కాపాడేం దుకు మున్సిపల్‌ అధికారులు 90 బెండెల్స్‌ ప్లాస్టిక్‌తో కూడిన 1500 ట్రీగార్డులు, తడకలతో చేసిన 4,357 ట్రీగార్డులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్న అధికారులు, ట్రీగార్డుల ఏర్పాటులో మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదోనని, పట్టణ ప్రజలు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడంతోనే సరిపోదు.. దానికి రక్షణ ఏర్పాటు చేయాలి. మొ క్క సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉ న్నా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనా ర్హం. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, నీరందించి వాటి ఎదుగుదలకు దోహదపడే చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు మున్సిపల్‌ సిబ్బంది మూటగట్టుకుంటున్నారు. దీంతో రెండో విడతలో నాటినా అవి ఎంతవరకు దక్కుతాయో తెలియదు.

సంరక్షణ గాలికి.. : 1.13 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించి 1.36 లక్షల మొక్కలు నాటామని చెబుతున్న మున్సిపల్‌ అధికారులు, వాటిలో ఎన్ని మొక్కలు ప్రస్తుతం బతికి ఉన్నాయన్న లెక్కలను మాత్రం చూపడం లేదు. ఉద్యమంగా తీసుకుని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మొక్క లు నాటినా.. వాటిలో ఇప్పటికే చాలా వరకు మొక్కలు ఎండిపోయాయి. మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోగా, వాటికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. కనీసం రెండో విడతలోనైనా, ప్రభుత్వం హరితహారానికి కేటాయించిన నిధులు, మొక్కలు ఎండిపోవడంతో దుర్వినియోగం అవుతున్నాయి. మొ క్కలను సంరక్షించేందుకు ప్రతిరోజూ రెండు ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నా, మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయో వారికే తెలియాల్సి ఉంది. నాటిన మొక్క నాటినట్లుగా ఎండిపోతుండగా, రికార్డుల్లోనూ ఎ క్కువ మొక్కలు నాటినట్లుగా అధికారులు చూపిస్తున్నారు. మరి లక్షలాది నిధులను ఖర్చు చేసి నా టుతున్న మొక్కలను ఎందుకు సంరక్షించడంలేదో అధికారులకే తెలియాలి. ‘మొక్కలను సంరక్షించేం దుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ట్రీగార్డుల ఏర్పాటులో జరిగిన ఆలస్యంతో కొన్ని మొక్కలు పశువుల పాలయ్యాయి. హరితహారంపై నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసుంధర అన్నారు.

మరిన్ని వార్తలు