నేటి నుంచి తిరుపతిలో సీఏల సదస్సు

12 Dec, 2016 14:50 IST|Sakshi
నేటి నుంచి తిరుపతిలో సీఏల సదస్సు

- హాజరు కానున్న 2,500 మంది ప్రతినిధులు
- రూ.50 లక్షలతో వేదిక నిర్మాణం ప్రారంభించనున్న మంత్రి గంటా
 
 యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం నుంచి రెండ్రోజులపాటు సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ ప్రాంతీయ చార్టర్డ్ అకౌంటెంట్‌ల సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. ఐసీఐఏ అధ్యక్షులు ఎం.దేవరాజరెడ్డి, కార్యదర్శి జామన్ కె.జార్జ్ హాజరవుతారు. బుధవారం నిర్వహించే ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేష్‌కుమార్ హాజరవుతారు. సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరవుతున్నందున ఏర్పాట్లు పూర్తి చేశారు.

వివిధ సంస్థలు 30 బిజినెస్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారుు. ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణ కుమార్, తిరుపతి చాప్టర్ చైర్మన్ రఘురామిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ సదస్సులో సీఏల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన సీఏలు హాజరవుతారన్నారు. ఇటీవల చేపట్టిన పెద్దనోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలపై చర్చించనున్నారన్నారు. 2017 మే నుంచి అమలులోకి రానున్న రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు