విద్యార్థులపై కేసు నమోదు

12 Dec, 2016 14:45 IST|Sakshi

కర్నూలు సిటీ: శ్రీచైతన్య కాలేజీలో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థి లోక్‌నాథ్‌ చౌదరి మృతికి ముగ్గురు విద్యార్థుల వేధింపులే కారణమని తండ్రి ఉమాపతి పిర్యాదు మేరకు తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంతోపాటు అనురాగ్‌రెడ్డి, గోవర్దన్‌, మనీష్‌క్రాంత్‌ అనే విద్యార్థుల వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 306 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు