మంత్రి గంటాపై కేసు ఎత్తివేతకు రంగం సిద్ధం!

25 Mar, 2016 14:30 IST|Sakshi
మంత్రి గంటాపై కేసు ఎత్తివేతకు రంగం సిద్ధం!

విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావుపై తుమ్మపాల షుగర్స్ ఆందోళన మిషయమై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధమయ్యింది. ఇది ప్రజా పోరామంటూ మంత్రిపై కేసులు ఎత్తివేయాలని సిఫార్సులు అందాయి. 2009, జనవరి 11న తుమ్మపాల షుగర్స్ ఆధునీకరణ, బకాయిల చెల్లింపుల విషయమై రైతులు ఆందోళన చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోనకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వవడంతో అప్పట్లో కేసు పెట్టారు.

ఎమ్మెల్యే గంటాను 11వ నెంబరు ముద్దాయిగా ఈ కేసులో నమోదు చేశారు. అయితే ఎ1 అవ్వాల్సిన గంటాను మంత్రి జోక్యంతో ఎ 11గా చేర్చారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గంటాను అబ్‌స్కాండెడ్ అని చూపించారు. ఇటీవల ఈ కేసు విషయమై హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో గంటాపై కేసు ఎత్తేయడానికి సిఫార్సు వచ్చింది.

రైతులపై పెట్టిన కేసుల గురించి పట్టించుకోకుండా కేవలం మంత్రిపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆయనొక్కరిపైనే కేసులు ఎత్తివేస్తే తమ పరిస్థితి ఏంటని ఏమవుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక నాయకులు, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు