నగదు రహితం..ఎంతో ఉత్తమం

12 Dec, 2016 14:50 IST|Sakshi
నగదు రహితం..ఎంతో ఉత్తమం
– జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): అన్ని శాఖల అధికారులు..నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం తర్వాత జిల్లా అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను నగదు రహిత లావాదేవీలు చేపట్టే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి అధికారి తన కింది స్థాయి సిబ్బంది మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌పై అవగాహన పెంచాలన్నారు. సమావేశంలోనే ప్రయోగాత్మకంగా  ఎస్‌బీఐ బడ్డీ  కలెక్టర్‌ తన స్మార్ట్‌ ఫోన్‌ నుంచి రూ. 100లను జెడ్పీ సీఇఓకు..అలాగే జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ కూడా తన స్మార్ట్‌ పోన్‌ ద్వారానే డీఆర్‌ఓ గంగాధర్‌గౌడుకు 100 రూపాయలు పంపి నగదు బదిలీ ఎంత సులభమో చూపించారు. జిల్లాలో 40 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయని.. ఖాతాదారులందరినీ ఆన్‌లైన్‌ లావాదేవీల వైపు మళ్లించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నుంచి ఇంటింటికి వెళ్లి బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి.. ఖాతాలు ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసి బస్సుల్లోను ఈ–పోస్‌ మిషన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు