'నాగార్జున వర్సిటీలో కుల రాజ్యం'

15 Jul, 2016 19:20 IST|Sakshi

విజయవాడ: ఆచార్య నాగార్జున వర్సిటీని కులరాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. విజయవాడలో శుక్రవారం కత్తి పద్మారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ సామ్రాజ్యవాదం, కులాధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో కారంచేడు, చుండూరు జరిగిన దాడుల నేడు విశ్వవిద్యాలయాల్లో చోటు చేసుకుంటున్నాయిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు లేకుండా వారిని అభద్రతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా ఉన్న దళితుడిని తొలగించి... చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆధిపత్యం ఇచ్చారని గుర్తు చేశారు. లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని కార్యనిర్వాహక కమిటీలో చేర్చి యూనివర్సిటీని కులరాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు.

ఏఎన్‌యూలో ఒకే కులానికి చెందిన ఐదుగురు వ్యక్తుల చేతుల్లో పాలన సాగుతోందన్నారు. ఏఎన్‌యూలో కుల, మత భావాలను ఆచరిస్తున్న రెక్టార్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, దూరవిద్య కేంద్రం డెరైక్టర్ పి.శంకరపిచ్చయ్య, పాలకమండలి సభ్యుడు కె.వెంకట్రావులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. వీటపై ఆగస్టు 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కత్తి పద్మారావు ప్రకటించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌