ఫుల్లు.. బాటిలెత్తి...

1 Aug, 2015 15:53 IST|Sakshi

నల్గొండ: ఎక్కడ కొంచెం సందు దొరికినా ఇంట్లోకి చొరబడి.. దొంగచాటుగా పాలు లాగించేయడం.. ఆనక గృహిణులు దొంగపిల్లి.. దొంగపిల్లి అని తిట్టుకోవడం మామూలే.... వాళ్లను గుర్రుగా చూస్తూ.. మూతినాక్కుంటూ.. మ్యావ్ అంటూ వెళ్లిపోవడం కూడా మనకు తరచూ కనిపించే దృశ్యమే. కానీ, ఇక్కడ  ఈ పిల్లి చూడండి ఏం చేస్తోందో!

ఇక్కడ పాలు  ఉన్నాయన్న సంగతిని పసిగట్టేసింది ఓ పిల్లి. ఇక ఆగుతుందా...  ఎటాక్ అంటూ రంగంలోకి దిగింది. అటూ ఇటూ చూసి పాలగ్లాసు మీదికి ఉరికింది. ఆబగా  తాగేసింది. అయితే, మూతంతా లోపల పెట్టి తాగాలంటే దానికి కుదరలేదు. ఇక మిగిలిన ఆ కాసిన్ని చుక్కలు ఎందుకు వదలాలి అనుకుందో... లేక  మన టాక్స్ పేయర్లలాగా.. అదేనండీ.. మన మద్యం ప్రియుల్లాగా.... ఆ గోల్డెన్ డ్రాప్ కూడా చప్పరిస్తే వచ్చే కిక్కే వేరప్పా అనుకుందో ఏమో గానీ.. గ్లాసు ఎత్తిపట్టేసింది.

కానీ పాపం...  పిల్లికి నిరాశే మిగిలింది.... పాలన్నీ కింద కారిపోవడంతో బిక్కమొహం వేసింది.

దీంతో ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే.. అని పాడుకోవాల్సిన మార్జాలం...అయ్యయ్యో.... ఆ కాసిని చుక్కలు పాయెనే... అంటూ తెల్లమొఖం వేసింది. ఆ ఫొటోలు మీకోసం..



ఫోటోలు..  కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

మరిన్ని వార్తలు