ఈడీ పిటిషన్ వెనక్కి

21 Aug, 2015 01:59 IST|Sakshi
  •  సమాన హోదా కలిగిన కోర్టుకు ఎలా బదిలీ చేస్తామని ప్రశ్న
  •  సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన సీసీ 9 చార్జిషీట్‌ను ఈడీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం వెనక్కి పంపింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం సెషన్స్ హోదా కలిగిన ఈ కోర్టు... ఇదే హోదా కలిగిన మరో కోర్టుకు చార్జిషీట్‌ను ఎలా బదిలీ చేయగలదో స్పష్టతనివ్వాలని న్యాయమూర్తి వెంకట రమణ ఆదేశించారు.

    నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ), అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాల ప్రకారం బదిలీ ప్రక్రియకు ఉండే నిబంధనలను వివరించాలని సూచించారు. కాగా తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉండగా... వారి అభ్యర్థన మేరకు వ్యక్తిగత హాజరుకు కోర్టు మినహాయింపునిచ్చింది.
     

మరిన్ని వార్తలు