ఘనంగా గీతా జయంతి

12 Dec, 2016 14:26 IST|Sakshi

నల్లగొండ కల్చరల్ : భారతదేశం వేదభూమి భగవద్గీత ప్రపంచానికి మహోపదేశం చేసిన మహాగ్రంథం అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత అన్నారు. శనివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలోని హిందూ ధర్మ ప్రచార మండలి కార్యాలయంలో నిర్వహించిన గీతా జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడం వల్ల భాషలో స్వచ్ఛత ఏర్పడి తద్వారా మాటలు అందంగా వినిపిస్తాయన్నారు. హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ మాట్లాడుతూ భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ హితబోధిని భగవద్గీత అని అన్నారు. గీతా జయంతి రోజును గురుపూజోత్సవంగా నిర్వహించాలని, భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.
 
  అనంతరం గీతా శ్లోక పఠన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని వి.అక్షర, రెండవ బహుమతిని సారుు సహస్రిత. 6, 7వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని వైష్ణవి, రెండవ బహుమతిని పల్లవి అందుకున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని బి.పల్లవి, రెండవ బహుమతిని జ్యోత్స్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కో - ఆర్డినేటర్ బి.సేవ్లా నాయక్, ప్రచార మండలి కార్యదర్శి అంకం మురళి, ఉపాధ్యక్షులు జ్యోతి, నన్నూరి రాంరెడ్డి, మారం శ్రీనివాస్, పెండ్యాల కృష్ణారావు, నీలకంఠం జనార్ధన్, అంజయ్య, ఉమేష్, త్రివేది తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు