పాస్‌పోర్టు మంజూరులో మైనర్లకు మినహాయింపులు

21 Aug, 2015 22:06 IST|Sakshi
పాస్‌పోర్టు మంజూరులో మైనర్లకు మినహాయింపులు

మర్రిపాలెం(విశాఖపట్నం) : పాస్‌పోర్ట్ మంజూరు దరఖాస్తు ప్రక్రియలో 18 ఏళ్ల లోపు మైనర్లకు ఆంక్షల వర్తింపులో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించినట్టు విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలియజేశారు. గతంలో మైనర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలన సమయంలో తల్లిదండ్రుల ఒరిజినల్ పాస్‌పోర్ట్‌లు తప్పక చూపించాలని ఆంక్షలు ఉన్నాయన్నారు. ఇకపై తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ జెరాక్స్ కాపీలు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ పాస్‌పోర్ట్‌ల కాల పరిమితి ముగిసినచో ఏదైనా చిరునామా ధ్రువపత్రం చూపించాలన్నారు.

మైనర్ల పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలనకు తల్లిదండ్రులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో హాజరు కావాలన్నారు. విదేశాలలో ఉన్నట్టయితే ఇండియన్ మిషన్ ధ్రువీకరించిన ‘అనెక్సార్-హెచ్’ ఫారమ్ కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులలో ఒక్కరే అందుబాటులో ఉన్నచో ‘అనెక్సార్-జి లేక సి’ ఫారమ్ జత చేయాలన్నారు. వైవాహిక జీవితానికి దూరమైన తల్లి లేక తండ్రి సంరక్షణలో ఉన్న మైనర్ జ్యుడీషియల్ లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాపీ కలిగి ఉండాలన్నారు. అనెక్సార్ సి,హెచ్,జి ఫారమ్‌లు త్వరలో పాస్‌పోర్ట్ వెబ్ పోర్టర్‌లో కేంద్రం అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు