సెప్టెంబర్‌ 2న అఖిల భారత సమ్మె

18 Aug, 2016 00:40 IST|Sakshi
 
కావలిఅర్బన్‌: కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సమ్మేళనంలో భాగంగా సెప్టెంబర్‌ 2న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు 12 కోర్కెల పరిష్కారానికై దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి సమాన పనికి సమాన వేతనం, అధిక ధరలు అదుపు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు తక్షణం రూ.5 వేలు చెల్లించాలని, మున్సిపల్‌ కార్మికుల పొట్టలు కొట్టే 279 జీవోను రద్దు చేయాలన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహన్‌ రావు, శ్రామిక మíß ళా యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ డి.అన్నపూర్ణమ్మ, కావలి డివిజన్‌ ఇన్‌చార్జి ఎస్‌కే రెహనాబేగం, జిల్లా కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌బీ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కే చాంద్‌ బాష, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు