సర్టిఫికెట్లు ఇస్తేనే పరీక్షకు అనుమతి

6 Aug, 2016 00:03 IST|Sakshi

భీమునిపట్నం: ధ్రువపత్రాలను ముందుగా అందజేస్తేనే గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు అనుమతి లభిస్తుందని గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్‌ కె.ప్రమీలాదేవి తెలిపారు. భీమిలి, అచ్యుతాపురం, నర్సీపట్నంలలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో (ఇంగ్లిషు మీడియం) ఖాళీల భర్తీ కోసం జరిగే ప్రవేశ పరీ„ý కు హాజరయ్యే విద్యార్థులు వారి సర్టిఫికెట్ల జెరాక్స్‌ కాపీలను తప్పనిసరిగా అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీన భీమిలి బాలికల గురుకుల పాఠశాలలో పరీక్ష జరుగుతుందని, ఇందులో పాల్గొనే విద్యార్థులు 9వ తేదీన స్టడీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జెరాక్స్‌ కాపీలను తీసుకువచ్చి అందివ్వాలని, లేకపోతే పరీక్షకు అనుమతించరని Ðð ల్లడించారు.

 

మరిన్ని వార్తలు