చైన్‌స్నాచర్ల చేతివాటం

30 Mar, 2017 23:30 IST|Sakshi

రాజంపేట టౌన్: బలిజపల్లె గంగమ్మ జాతరకు గురువారం భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారు పూలరథంలో ఊరేగుతూ వచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. ఆ సమయంలో దాదాపు ఐదుగురి మహిళల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. అర్బన్‌ సీఐ అశోక్‌కుమార్‌, సీఐ జాతరకు రెండు రోజుల ముందే జాతరలో బంగారు నగలు ధరించిన వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే అనేక మంది బంగారు నగలు ఎక్కువగా ధరించి రావడం, భక్తులు తాకిడి అ«ధికంగా ఉండటం దీనికితోడు భక్తులు బంగారు నగల పట్ల అప్రమత్తంగా లేక పోవడంతో చైన్‌స్నాచర్ల పని సులువైంది. ఇదిలావుంటే పిక్‌ప్యాకెటర్లు కూడా తమ చేతివాటాన్ని చూపి అనేక మంది పర్సులను దొంగలించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు