గొలుసు దొంగల హల్‌చల్‌

12 Aug, 2016 00:17 IST|Sakshi
గొలుసు దొంగల హల్‌చల్‌
 
నెల్లూరు (క్రైమ్‌) : నగరంలో గొలుసు దొంగలు హల్‌చల్‌ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. కొండాయపాళెం గంగ్రోతినగర్‌లో మురళీకృష్ణ బుధవారం రాత్రి తన కుమార్తె నాగశ్రీవిద్యతో కలిసి నగరానికి వెళ్లాడు. తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మినీబైపాస్‌రోడ్డులో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వారిని వెంబడించారు. నాగశ్రీవిద్య మెడలోని నాలుగు సవర్ల బంగారు దండను లాకెళ్లారు. దీంతో ఆమె కిందపడి గాయాలపాలైంది. చోరీ ఘటనపై బాధిత తండ్రి ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు  చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
మోడరన్‌ స్కూల్‌ సమీపంలో.. 
కుమార్తెకు భోజనం పెట్టి ఇంటికి వస్తుండగా ఓ మహిళ మెడలోని బంగారు సరుడును దుండగులు లాక్కెళ్లారు. ఈసంఘటన సరస్వతీనగర్‌లోని మోడరన్‌ స్కూల్‌ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌నగర్‌ సరస్వతీనగర్‌లో టి. రమణారెడ్డి, దొరసానమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె మోడరన్‌ స్కూల్‌లో చదువుతోంది. గురువారం మధ్యాహ్నం దొరసానమ్మ ఆమె కుమార్తెకు భోజనం పెట్టి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆమెను బైక్‌పై వెంబడించి మెడలోని మూడు సవర్ల బంగారు సరుడును లాక్కెళ్లారు.  బాధితురాలు బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు