దీక్ష విరమించిన చలసాని

11 May, 2016 13:28 IST|Sakshi

అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్ష బుధవారం విరమించారు. ప్రత్యేక హోదా కోసం ఆదివారం నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర అనారోగ్యం పాలైతే... పోలీసులు ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రిలో కూడా ఆయన ప్రత్యేక హోదా కోసం దీక్షను విరమించలేదు. బుధవారం ఆస్పత్రికి చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిమ్మరసం ఇచ్చి చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్షను విరమింపజేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ మేరకే తాను చేపట్టిన దీక్ష విరమిస్తున్నట్లు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు