వ్యాపారులకు అండగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

28 Sep, 2016 18:20 IST|Sakshi
వ్యాపారులకు అండగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌
పాత గుంటూరు: 75 ఏళ్ల నుంచి వ్యాపార, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విశేష కృషి చేసిందని ది ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. జిన్నాటవర్‌ సెంటర్‌లోని చాంబర్‌ కార్యాలయంలో మంగళవారం 77వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆతుకూరి ఆంజనేయులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో 3 వేల మంది సభ్యులు, 90 అనుబంధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ యాక్ట్‌ కింద రిజిష్ట్రరు అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చాంబర్‌ గుంటూరు ఒక్కటేనన్నారు. ఎక్స్‌పోర్టు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఆరిజన్‌ ఇచ్చే అధికారం ఉందన్నారు. జిల్లాలో పొగాకు, మిర్చి, కాటన్‌ ఎగుమతి అవుతుందని, ఎవరైనా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళాలంటే చాంబర్‌ లెటర్‌ ఉంటేనే వ్యాపార వీసా ఉంటుందని వెల్లడించారు.  డిసెంబరులో చాంబర్‌ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం∙జూబిలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులును సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు, మిత్రులు శాలువా, పూలదండలతో సత్కరించారు. సంస్థ కార్యదర్శి అన్నా పూర్ణచంద్రారవు, గజవల్లి శివన్నారాయణ, రంగ బాలకృష్ణ, తూనుగుంట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు