ముద్రగడతో చర్చలకు సీఎం విముఖత!

1 Feb, 2016 18:09 IST|Sakshi
ముద్రగడతో చర్చలకు సీఎం విముఖత!

విజయవాడ: కాపుల రిజర్వేషన్ పోరాటం ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలని పలువురు మంత్రులు సూచించగా.. ముఖ్యమంత్రి వారి వాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముద్రగడ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. మిగిలిన కాపు నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికేలా చూడాలని కోరినట్లు సమాచారం.

కాగా, తుని ఘటనకు సంబంధించి ముద్రగడను బాధ్యునిగా చేస్తూ ఎదురు దాడి చేయాలని, అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను రెచ్చగొట్టే ధోరణి వల్లే కాపు ఉద్యమం హింసాత్మకమైందని ఆరోపిస్తూ విమర్శలు చేయాలని పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

 

మరిన్ని వార్తలు