ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసింది: చంద్రబాబు

25 Jan, 2016 15:00 IST|Sakshi
ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసింది: చంద్రబాబు

విజయవాడ :  దావోస్ సదస్సు వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు కలిగిందని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన సోమవారం దావోస్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.  పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంతో మారే పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా అందించవచ్చో తెలుసుకున్నట్లు చెప్పారు.

 

దావోస్ సమావేశం వల్ల ప్రపంచం గురించి తెలిసిందని చంద్రబబు తెలిపారు. ప్రపంచానికి పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న ఛాలెంజ్ అని చెప్పారు. జురిక్ లో 11 దేశాల ప్రతినిధులను కలిసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఆలోచన ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుందన్నారు.  సాంకేతిక యుగంలో నైపుణ్యం, సమర్థత పెంచుకోగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని సాధించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు