చంద్రన్నా...ఇవేమి కానుకలు

23 Dec, 2016 00:27 IST|Sakshi
  • క్రిస్మస్‌ పండుగకూ నిరాశే  ∙
  • 20 నుంచి ప్రారంభమైనా çపూర్తి స్థాయిలో పంపిణీకి చుక్కెదురు
  • సరిపడా సరుకు కూడా జిల్లాకు రాని వైనం  l
  • శెనగ పప్పు అరకొరే  సంక్రాంతికీ అనుమానమే 
  • ఇబ్బందుల్లో కార్డుదారులు ∙ ‘చంద్రన్న’ ‘కానుక’ల  తీరిదీ...
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    చంద్రన్న కానుకల పంపిణీ ఆదిలోనే అపహాస్యం పాలైంది. డిసెంబరు, జనవరి నెలల్లో వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగల కోసం చంద్రన్న కానుకలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.జిల్లాలో బుధవారంæనుంచే పంపిణీ ఆర్భాటంగా చేపట్టినా అరకొరగానే విడుదలచేసి ఎప్పటిలానే మళ్లీ అభాసుపాలైంది.  ఈ నెల 25న క్రిస్మస్‌. గురువారం నాటికి కూడా పూర్తి స్థాయిలో సరుకులు చౌక ధరల దుకాణాలకు చేరలేదు. ఇస్తామన్న ఆరింటిలో కందిపప్పు, శెనగపప్పు, బెల్లం అరకేజీ వంతున, గోధుమపిండి కేజీ, పామాయిల్‌ అర లీటరు, నెయ్యి 100 గ్రాములు ప్యాకింగ్‌తో పంపిణీ చేసేందుకు సరుకులు విడుదల చేసింది. చౌక ధరల దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేయాల్సి ఉంది. క్రిస్మస్‌కు ముచ్చటగా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతవరకు  క్రిస్మస్‌ సరుకులు కార్డుదారుల దరిచేరలేదు. వాస్తవానికి ఈ నెల 20 నుంచి 26లోపు క్రిస్టమస్‌ లబ్థిదారులకు, జనవరి ఒకటి నుంచి 15వ తేదీ వరకు మిగిలిన కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా సరుకులు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. తీరా విడుదల్లో జాప్యంతో ఇప్పటి వరకు కూడా సరుకులు పూర్తిగా రేష¯ŒSకార్డుదారులకు అందలేదు. జిల్లాలో 2,643 చౌక దుకాణాల పరిధిలో 15 లక్షల 26 వేల 674 మంది రేష¯ŒS కార్డుదారులున్నారు. వీరిలో క్రిస్మస్‌ సందర్భంగా కానుకలు ఇచ్చే లబ్ధిదారులు మూడు లక్షలు వరకు ఉన్నారు. ప్రభుత్వం జిల్లాకు సరుకులు కేటాయింపులకు, విడుదలకు అసలు ఎక్కడా పొంతన లేని పరిస్థితి నెలకుంది. ఆరు సరుకుల్లో ఐదు సరుకులు ప్రస్తుతం క్రిస్మస్‌ కార్డుదారులకు సరిపడా విడుదలైనా శెనగపప్పు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లాకు విడుదల కాలేదు. ఫలితంగా గురువారం జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, రంపచోడవరం తదితర నియోజకవర్గాల్లో చంద్రన్న కానుకల పంపిణీని ప్రారంభించారు. శెనగపప్పు అరకొరగానే కేటాయింపులు రావడంతో చౌకధరల దుకాణాలకు అంతంత మాత్రంగానే విడుదల చేశారు. పండుగ పేరుతో సరుకులు ఇస్తామని చెప్పి పూర్తిగా ఇవ్వకుండా తరువాత ఇస్తే ఉపయోగమేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ నగరాన్నే తీసుకుంటే 60 వేల కార్డుదారులున్నారు. గత క్రిస్మస్‌ సరుకు పంపిణీ లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం కాకినాడలో 13 వేల రేష¯ŒS కార్డుదారులు క్రిస్మస్‌ కానుకకు అర్హులుగా ఉన్నారని లెక్క తేల్చారు. కానీ వీరిలో సగానికి సగం ఆరువేల మందికి సరిపడా శెనగపప్పు మాత్రమే జిల్లాకు వచ్చింది. జిల్లా అంతటా చూసుకుంటే మూడు లక్షల మంది క్రిస్మస్‌ కానుకలకు అర్హులుగా ఉన్నారని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. వీరిలో ప్రస్తుతం విడుదలైన కోటా 15శాతం కార్డుదారులకు మాత్రమే సరిపోయేలా కనిపిస్తోంది. క్రిస్మస్‌ లబ్దిదారులకు పంపిణీ కోసం రేష¯ŒS షాపులకు 30 శాతం సరుకులు చేరవేయాల్సింది. కానీ శెనగపప్పు అరకొరగా రావడంతో షాపులకు పూర్తి స్ధాయిలో చేరవేయలేని పరిస్ధితి నెలకుంది. మిగిలిన సరుకులు రేష¯ŒS దుకాణాలకు సరఫరా చేసినా శెనగపప్పు లేకుండా మిగిలిన వాటిని తీసుకునే పరిస్థితి ఉండదని డీలర్లు పేర్కొంటున్నారు. కనీసం సంక్రాంతి నాటికైనా పూర్తి స్థాయిలో అందరికీ సరుకులు అందేటట్టు చూడాలంటున్నారు.
     
    కేటాయింపు    (మెట్రిక్‌ టన్నుల్లో)
    సరుకులు కేటాయింపు వచ్చినది            
    శనగపప్పు 763.337 122
    కందిపప్పు 763.337 374
    బెల్లం 763.337 334
    నెయ్యి 152.667 8 లక్షల 28వేల ప్యాకెట్లు
    గోధుమపిండి 1526.674 1427
    పామాయిల్‌ 763.337 439
     
మరిన్ని వార్తలు