చిరుతల కలకలం

25 Aug, 2016 23:52 IST|Sakshi
చిరుతల కలకలం

రాయదుర్గం : పట్టణంలోని ఈ సేవా కేంద్రం వద్ద గురువారం రెండు చిరుతపులులు కలకలం సృష్టించాయి. ఓ చిరుత ఉదయమే వెళ్లిపోగా.. మరో చిరుతను అటవీశాఖాధికారులు, ప్రజలు దాదాపు నాలుగు గంటల పాటు య త్నించి.. చివరికి బంధించారు. అంతా ఊపిరిపీల్చుకు న్న సమయంలో ఉదయం వెళ్లిపోయిన చిరుత మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో అదే ప్రాంతానికి రావ డంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలో నుంచి బుధవారం అర్ధరాత్రి ఈ సేవా, రిలయన్స్‌ టవర్‌ వద్ద ఉన్న ముళ్ల పొదల్లోకి రెండు చిరుతలు చేరుకున్నాయి. అక్కడ పందులపై దాడి చేసి తిన్నాయి. తెల్లవారగానే.. ఓ చిరుత కొండల్లోకి వెళ్లిపోయింది. మరొకటి అక్కడే నిద్రించింది.

ఉదయం 10 గంటల సమయంలో ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లగా చిరుత కన్పించింది. దీంతో స్థానికులకు చెప్పాడు. అయినా ఎవరూ నమ్మలేదు. చివరికి కొందరు యువకులు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో రవినాయక్‌ అనే యువకుడిపై చిరుత దాడి చేయగా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. అటవీశాఖాధికారులు, పోలీసులకు సమాచారం అందించి ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖాధికారులు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని వలలు సిద్ధం చేసుకున్నారు. 


ప్రజలు, యువకుల కేరింతలతో చిరుత భయపడి ఈ సేవా కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కింది. ఆసమయంలో అక్కడున్న జాఫర్‌ అనే యువకుడిపై దాడి చేయగా స్వల్పగాయాలయ్యాయి. అనంతరం చెట్టు నుంచి కిందకు దూకి ముళ్లపొదల్లోకి దూరింది. దీంతో వల వేసి చిరుతను పట్టుకున్నారు. చిరుతను ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీపతినాయుడు కళ్యాణదుర్గం రేంజ్‌ కార్యాలయానికి తలించారు. అక్కడి నుంచి తిరుపతి జూకు తరలిస్తున్నట్లు చెప్పారు.  అయితే మళ్లీ రాత్రి 11గంటల సమయంలో ఉదయం వెళ్లిపోయిన చిరుత యథాస్థానానికి వచ్చి చేరడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. దాన్ని పట్టుకోవడానికి అధికారులు యత్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు