చీటింగ్‌ కేసులో నిందితుడి అరెస్టు

29 Aug, 2016 21:25 IST|Sakshi
అనపర్తి (బిక్కవోలు) :
ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో వ్యాపారం కోసం రుణం పొంది, బ్యాంకును మోసం చేసిన కేసులో రెండో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పశివేదలలోని పౌల్ట్రీ ఫారం వ్యాపారం కోసం కర్రి సత్యనారాయణరెడ్డి 2011లో రూ.43.50 లక్షల రుణం పొందారు. దీనికి పులగం రామారెడ్డికి కాకినాడలో ఉన్న 400 చ.గ. స్థలాన్ని హామీగా పెట్టారు. కొంతకాలం సక్రమంగా రుణ  బకాయిలు చెల్లించారు. కొంత కాలం నుంచి రుణకిస్తీలను చెల్లించకుండా పరారీలో ఉన్నారు. అనుమాన ం వచ్చిన బ్యాంకు రాజమండ్రి రీజినల్‌ మేనేజర్‌ గొల్లపల్లి రామచంద్రరావు రికార్డు తనిఖీ చేయగా, ఆ స్థలం రికార్డు బోగస్‌ అని గుర్తించారు. దీంతో సత్యనారాయణరెడ్డి, రామారెడ్డితో పాటు వాల్యుయేషన్‌ రిపోర్టు ఇచ్చిన సిద్దార్థ అసోసియేట్స్‌ ఇంజనీర్‌ కేవీ మురళీమోహన్, రాజమండ్రి రీజియన్‌ ఎస్‌బీఐ న్యాయ సలహాదారు పి.దుర్గాదివాకర్‌పై గత ఏడాది డిసెంబర్‌లో అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు రామారెడ్డిని ఎస్సై కిషోర్‌కుమార్‌ సోమవారం అనపర్తిలో అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
 
>
మరిన్ని వార్తలు