ఉల్లి కొనుగోళ్లలో అక్రమాలను సహించం

13 Oct, 2016 23:30 IST|Sakshi
ఉల్లి కొనుగోళ్లలో అక్రమాలను సహించం
కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని  జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కమీషన్‌ ఏజెంట్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉల్లి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ...ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులకు న్యాయం జరిగే విధంగా మద్దతు ధర రూ.600 నిర్ణయించామన్నారు. ఈ నేపధ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని అర్హులయిన ప్రతి రైతుకు తగిన మద్దతు లభించాలన్నారు. ఉల్లి నాణ్యత, గ్రేడింగ్‌ను బట్టి వేలంపాటలో ధర నిర్ణయించాలని సూచించారు.మద్దతు ధర కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోళ్లలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏ రోజు కొన్ని ఉల్లిని అదే రోజు బయటికి తరలించాలన్నారు.  సమావేశంలో ఏడీఎం సత్యనారాయణచౌదరి, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి, కమీషన్‌ ఏజెంట్ల సంఘం ప్రతినిధులు పల్లె శ్రీనివాసులురెడ్డి, కట్టా శేఖర్, శేఖర్‌ రెడ్డి, కేశవరెడ్డి, ఉల్లి వ్యాపారులు ప్రసన్న, సంజీవయ్య, గోకారి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు