ఊపందుకున్న సర్టిఫికెట్ల పరిశీలన!

11 Jul, 2017 23:17 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మంగళవారం ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 431 స్కూళ్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. అనంతపురం డివిజన్‌లో 75, గుత్తి డివిజన్‌లో 108, పెనుకొండ డివిజన్‌లో 128, ధర్మవరం డివిజన్‌లో 120 స్కూళ్ల టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు.  

అన్ని డివిజన్లకూ సంబంధించి 56 స్కూళ్లు పెండింగ్‌ ఉన్నాయి. బుధవారం ఉదయమే వాటిని పూర్తి చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే ఈనెల 12తో ఈ ప్రక్రియను ముగించాల్సిన నేపథ్యంలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులు సైన్స్‌ సెంటర్‌కు రావాలని ఆదేశించారు. వివిధ పాయింట్ల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్ల ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలన్నారు.

 

మళ్లీ కనిపిస్తే సస్పెండ్‌ చేస్తా : డీఈఓ

‘ఏవైనా పాయింట్లకు సంబంధించిన సమస్యలుంటే నేరుగా ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫిర్యాదులు చేయాలని పదేపదే చెప్పా. పత్రికల్లో వచ్చాయి. సెల్‌ఫోన్లలో రోజూ మెసేజ్‌లు పంపుతున్నా. అయినా టీచర్లలో మార్పు రావడం లేదు. పాఠశాల సమయంలో సైన్స్‌ సెంటర్‌కు ఎందుకొస్తున్నారు? మళ్లీ కనిపిస్తే సస్పెండ్‌ చేస్తా’ అని డీఈఓ హెచ్చరించారు. దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సైన్స్‌ సెంటర్‌ ప్రాంగణంలో మంగళవారం ఉదయం పలువురు టీచర్లు కనిపించారు. వారిని చూడగానే డీఈఓ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను నాశనం చేయొద్దన్నారు. బడులు వదిలేసి రావద్దంటే కూడా అలాగే వస్తారా? అని మండిపడ్డారు.  

>
మరిన్ని వార్తలు