రసాయనిక శాస్త్రంతో మానవ మనుగడ

20 Aug, 2016 23:09 IST|Sakshi
మాట్లాడుతున్న గోవర్ధనమెహతా
  • పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్‌ మెహతా
  • ట్రిపుల్‌ ఐటీలో జాతీయ స్థాయి సదస్సు
  • నూతన ఆవిష్కరణపై చర్చలు 
  • బాసర : మానవుని మనుగడ రసాయనిక శాస్త్రంతో ముడి పడి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ గోవర్ధన్‌ మెహతా అన్నారు. శనివారం బాసర ట్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీలో ‘రసాయనిక, పదార్థ శాస్త్రాల్లో ఇటీవల కాలంలో వస్తున్న పురోగతి’పై జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరానికే కాకుండా విశ్వవ్యాప్తమైన సృష్టి అంతా రసాయనాలతో నిండి ఉందని చెప్పారు.
     
    ఇటీవల కాలంలో నోటి, దంత క్యాన్సర్, ఎయిడ్స్‌ తదితర ప్రాణాంతక వ్యాధులపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించిన ఔషధాలు, వాటి పనితీరుపై ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. వ్యాధుల నివారణకు తయారు చేయాల్సిన డ్రాగ్‌ డిజైనింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పలువురు రసాయనిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నానో మెటీరియల్, సెమీ కండక్టింగ్, పాలిమర్‌ మెడిసిన్‌ మందుల తయారీ గోడప్రతుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ప్రపంచం మెుత్తాన్ని గడగడలాడించిన ఎబోలా, వ్యాధులకు మందు కనిపెట్టారని తెలిపారు.
     
    నానోటెక్నాలజీ ద్వారా ఆభరణాలు, పింగళి వస్తువుల తయారీకి ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీ కళాశాల వైస్‌ఛాన్స్‌లర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ రసాయనిక, భౌతిక శాస్త్రంలో రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో గోవర్ధన్‌మెహతా, ఢిల్లీ సీఎస్‌ఐఆర్టీ ప్రొఫెసర్‌ జేఎస్‌ యాదవ్, కళాశాల వైస్‌ ఛాన్స్‌లర్‌ సత్యనారాయణ మెుక్కలు నాటారు.  సదస్సులో బాసర ఐఐఐటీ రయసానిక విభాగ అధిపతి రవివారల, శ్రీపాద్, వివిధ జిల్లాల రసాయనిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు