ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు

27 Feb, 2017 00:12 IST|Sakshi
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
భీమవరం : చదరంగంపై ఇటీవల అన్ని వయస్సుల వారిలో ఆసక్తి పెరిగిందని చెస్‌ అసోసియేషన్‌  జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య అన్నారు. భీమవరం అనసూయ చెస్‌ అకాడమీలో ఆదివారం నిర్వహించిన  రాష్ట్రస్థాయి మహిళా చదరంగం పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందచేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చెస్‌తో మేథస్సుకు పదును పెడుతుందన్నారు. ఈనాటి విజేతలు జూన్‌ నెలలో గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా చందరంగం పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్‌ కార కార్యదర్శి మాదాసు కిషోర్‌ మాట్లాడుతూ ఈ నెల 28న అండర్‌ 11 జిల్లాస్థాయి బాలబాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో గెలుపొందిన గ్రంధి సౌమ్యబాల(కాళ్ల), కెఎల్‌ రోషిణి(ఏలూరు), కామన దివ్య(భీమవరం, గ్రంధి కావ్య(కాళ్ల)లకు మెడల్స్, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందచేశారు. ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు