తండ్రి, తనయుడి ప్రోత్సాహంతోనే..

30 Aug, 2016 22:47 IST|Sakshi
తండ్రి, తనయుడి ప్రోత్సాహంతోనే..
  • చెస్‌ టోర్నీల్లో అడుగుపెట్టా : రాధాకుమారి
  • ఏడోసారి ఎల్‌ఐసీ ఆల్‌ ఇండియా చెస్‌ టోర్నీకి 
  •  
    ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : 
    తండ్రి, తనయుడి ప్రోత్సాహంతోనే తాను చెస్‌ టోర్నీల్లో పాల్గొంటున్నానని ఎల్‌ఐసీ ఆల్‌ ఇండియా చెస్‌ టోర్నీకి ఎంపికైన 45 ఏళ్ల  వెంపరాల రాధాకుమారి తెలిపారు. ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్‌ కార్యాలయ పరిధిలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బ్రాంచిలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. ‘చిన్నతనం నుంచి నాకు చెస్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో మా నాన్న వెంపరాల ప్రభాకరావు వద్దే ఆడడం నేర్చుకున్నా. చెస్‌ క్రీడాకారుడైన నా తనయుడు ఉపాధ్యాయుల సమీర్‌కుమార్‌ ప్రోత్సాహంతో 2007 నుంచి టోర్నమెంట్లలో పాల్గొంటున్నా. ఎల్‌ఐసీ టోర్నమెంట్లతో పాటు, 2014లో హైదరాబాద్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బెస్ట్‌ ఉమెన్‌గా సెలెక్ట్‌ అయ్యాను. రాజమహేంద్రవరం డివిజనల్‌ కార్యాలయం తరఫున ఎల్‌ఐసీ సౌత్‌ జోన్‌ చెస్‌ టోర్నమెంటులో పాల్గొని ద్వితీయస్థానం సాధించా. ఎల్‌ఐసీ ఆల్‌ ఇండియా చెస్‌ టోర్నీకి ఏడోసారి ఎంపికయ్యా. 2015–16 ఆల్‌ఇండియా చెస్‌ టోర్నీలో బ్రాంజ్‌మెడల్‌ సాధించాను. భర్త ఉపాధ్యాయుల సూర్యనారాయణమూర్తి, ఎల్‌ఐసీ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహంతోనే చెస్‌లో రాణిస్తున్నా.’’  
     
మరిన్ని వార్తలు