కాల్వలో పడి చిన్నారి మృతి

24 Sep, 2016 22:15 IST|Sakshi
కాల్వలో పడి చిన్నారి మృతి
ఆత్మకూర్‌(ఎస్‌)
 కాల్వలో పడి చిన్నారి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని కందగట్ల ఆవాసం మంగళితండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భానోత్‌ రవి–భారతిల కుమార్తె అఖిల (4)ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులోని రోడ్డు వెంట కాల్వలో పడిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాల్వల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక చనిపోయింది. సాయంత్రం వరకూ అఖిల ఇంటì కి చేరకపోవడంతో తల్లితండ్రులు చుట్టుపక్కల వెదకగా కాల్వలో విగతజీవిగా కనిపించింది. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న కుమార్తె మరణంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.
 
మరిన్ని వార్తలు