డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి

20 Sep, 2016 22:37 IST|Sakshi
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి

హిందూపురం ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

హిందూపురం అర్బన్‌ : స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ లక్షణాలతో చిన్నారి నవిత (4) మంగళవారం మతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప ప్రాణాలు కోల్పోయిందని చిన్నారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మడకశిర మండలం కెరసానిపల్లికి చెందిన నాగమణి, నరసింహులు దంపతుల కుమార్తె నవితకు జ్వరం రావడంతో ఈనెల 17వ తేదీ హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

వైద్యులు పరీక్షలు చేసి హైఫీవర్‌ ఉంది. రెండు రోజుల్లో పరిస్థితి మెరుగు పడుతుందని భరోసా ఇచ్చారు. నాలుగు రోజుల నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్లు జ్వరం తగ్గుతుందని చెబుతూ వచ్చారు. కాగా మంగళవారం ఉదయం నవితకు జ్వరం ఎక్కువైంది. ఈ క్రమంలో ఫిట్స్‌ మొదలై కొంతసేపటికే శరీరం చల్లబడిపోయింది. గమనించిన తల్లి నాగమణి వెంటనే వైద్యులను తీసుకొచ్చింది. పరీక్షించిన డాక్టర్లు హైఫీవర్‌ కారణంగా చనిపోయిందన్నారు.

ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
చిన్నారి నవిత చనిపోయిందనే విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. వైద్యులతో పాటు సూపరింటెండెంట్‌ కేశవులతో వ్వాగాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐలు దిలీప్, వెంకటేశులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు