వికటించిన వైద్యం

6 May, 2017 00:11 IST|Sakshi

హిందూపురం రూరల్‌ : పురిటి నొప్పుల ప్రసవంతో వచ్చిన ఒక మహిళకు శస్త్రచికిత్స (సిజేరియన్‌) నిర్వహించగా పురుటిబిడ్డ మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గిరీష్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హిందూపురం పట్టణం ఎంఎఫ్‌రోడ్డులో నివాసం ఉంటున్న దివ్యజ్యోతికి ఏడాది క్రితం మడకశిరలోని శ్రీనివాసులుతో వివాహంమైంది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణంలోని గిరీష్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈక్రమంలో 9 నెలలు నిండిన తర్వాత కాన్పు కోసం వెళ్తే స్కానింగ్‌ చేసి బిడ్డ క్షేమంగా ఉందని.. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు.

దివ్యజ్యోతి ఉదయం నుంచే ఆస్పత్రిలో ఉంది. అయితే చివరి నిమిషంలో సిజేరియన్‌ చేయాలని కోరగా చేశారు. కానీ పురిటి బిడ్డ మృత్యువాత పడిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై వైద్యురాలు సంధా్యలక్ష్మిని అడగ్గా సాధారణ కాన్పు చేయాలని కోరారు.  అయితే పరిస్థితి మారడంతో సిజేరియన్‌ చేశామన్నారు. బిడ్డ ఉమ్మి నీరు తాగి తల వాపు రావడంతో మృతి చెందినట్టు తెలిపనారు. విషయం తెలుసుకున్న ఐఎంఏ కార్యదర్శి బాలాజి అక్కడికి చేరుకుని బాధితులకు, వైద్యులకు సర్ది చెప్పారు.

మరిన్ని వార్తలు