అమ్మ ఒడికి చిన్నారి

28 Oct, 2016 21:48 IST|Sakshi
అమ్మ ఒడికి చిన్నారి
  • నిందితురాలి పట్టివేత
  • కాకినాడ క్రైం : 
    కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన పసికందును పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకెళితే ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన రెడ్డి లక్షి్మకి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం అక్టోబర్‌ 25న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. బుధవారం తెల్లవారుజాము 3.30కు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి 9.50 తల్లి పక్కలో నిద్రిస్తోన్న పసికందు అదృశ్యమైంది. బిడ్డ కనిపించకపోవడంతో ఆస్పత్రి అంతా గాలించారు. ఫలితం లేకపోవంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఏలేశ్వరం అంబేడ్కర్‌కాలనీకి చెందిన పలివెల లక్ష్మి బాధితురాలితో చనువుగా ఉంటూ, çపసికందును లాలించడం చేస్తుండేది. గురువారం రాత్రి 9.30 తల్లిపక్కలో పడుకున్న పసికందును ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో పక్కవారు వారించారు. అనంతరం అందరూ నిద్రపోయాక ççపసికందును తీసుకుని ఉడాయించింది. అయితే గురువారం ఉదయం 9.30 , సాయంత్రం 7.30కు పక్కన ఉన్న వారి సెల్‌ఫో¯ŒS నుంచి ఫో¯ŒS చేసి నంబరు తీసేసింది. గురువారం రాత్రి 10.05కు బయట వ్యక్తుల నుంచి ఫో¯ŒS వచ్చింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలను ఒకటో పట్టణ సీఐ ఏఎస్‌ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించి, బిడ్డను ఎత్తుకు పోతున్న ఆ«ధారాన్ని గుర్తించి, సెల్‌ఫో¯ŒS నంబర్‌ ఆధారంగా కిర్లంపూడి మండలం ఎస్‌.తిమ్మాపురంలో నిందితురాలు పలివెల లక్షి్మని ఆమె పిన్ని మంజేటి పాప ఇంటి వద్ద పట్టుకుని, చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏఎస్‌ రావు చెప్పారు. ఈ కేసును కేవలం 12 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ ఏఎస్‌.రావును, తల్లిదండ్రులు, వైద్యులు అభినందించారు.  
     
    మమకారం చంపులేక...
    కడుపులో ఉండగానే ముగ్గురు పిల్లలు చనిపోవడం...భవిష్యత్‌లో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో.. పిల్లలపై మమకారం చంపుకోలేక ఏంచేయాలో తెలియని స్థితిలో పలివెల లక్ష్మి పసికందును అపహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో పేషెంటుగానే ఉందని, గురువారం డిశ్చార్జ్‌ కావాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈలోగా ఆమె ఈ పని చేసిందంటున్నారు.  
     
    బిడ్డను చూస్తాననుకోలేదు  
    నాలుగు రోజులుగా పలివెల లక్ష్మి నాతో చనువుగా ఉంటోది. నిద్ర మత్తులో ఉండగా రాత్రి వచ్చి çపక్కలో ఉన్న బిడ్డను తీసుకుంది. బిడ్డ ఏడుపు వినిపించింది. పాప దోరకదని కుమిలిపోయాం. నాకు 12 ఏళ్ల కూతురు ఉంది. రెండో కాన్పులో పాప పుట్టింది. పోలీసులకు మేము రుణపడి ఉంటాం. – రెడ్డి లక్ష్మి
     
    కానరాని భద్రత
    కాకినాడ వైద్యం : జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శిశువు అపహరణ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఏటా 8 లక్షల 16 వేల మంది రోగులు వస్తుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ఆస్పత్రిలో ముఖ్యంగా మాతా, శిశు విభాగం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. కేవలం సీసీ కెమెరాలమీదే కాకుండా సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సి ఉంది. గతంలో మాతా, శిశువుల వార్డులో తల్లి, బిడ్డకు గుర్తింపుగా స్టిక్కర్లు వేసేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థను అధికారులు పక్కన పెట్టారు. వార్డుల్లోకి ఎంతమంది వచ్చినా పట్టించుకోవడం లేదు. దాంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. త్వరలో కలెక్టర్‌ అనుమతితో జియో ట్యాగింగ్‌ వి«ధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.నాగేశ్వరరావు తెలిపారు.   
     
మరిన్ని వార్తలు