బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

4 Feb, 2017 22:42 IST|Sakshi
  • సీబీసీఐడీ మెజిస్ట్రేట్‌ శివశంకర్‌
  • కాకినాడ లీగల్‌ : 
    సామాజిక రుగ్మతగా మారిపోయిన బాలకార్మిక వ్యవస్థను, యాచక వృత్తిని రూపుమాపాల్సిన అవసరం ఎంతయినా ఉందని కాకినాడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, సీబీసీఐడీ జడ్జి కె.శివశంకర్‌ అన్నారు. స్థానిక గాంధీ భవ¯ŒSలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా కేరింతలు కొడుతూ పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన బాలల జీవితాలు యాచక వృత్తిలోనూ, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలలను సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పించకపోతే భవిష్యత్‌లో వారు సంఘ విద్రోహశక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఒక ఉద్యమంగా తీసుకుని సమష్టిగా ఆ వ్యవస్థలను సమూలంగా నిర్మూలించాల్సి ఉందన్నారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.శివరామప్రసాద్‌ మాట్లాడుతూ నేటిబాలలే రేపటి పౌరులని, బాలలను తీర్చిదిద్దితే దేశానికి, సమాజానికి మేలు జరుగుతుందన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఇ¯ŒSచార్జి పీడీ పంతం సావిత్రి మాట్లాడుతూ బాలల వసతి గృహనిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు