అమ్మ కావాలి..

16 Aug, 2016 23:30 IST|Sakshi
అమ్మ కావాలి..

అనంతపురం సిటీ : ‘‘ నాకు అమ్మ కావాలి. నేను నాన్న చెంతకు చేరాలి. నన్ను ఎవరో ఇసుక దిబ్బలపై వదిలి వెళ్లారు. దిక్కూమొక్కూలేని దానిలా గుక్క పట్టి ఏడుస్తుంటే ఓ అమ్మ నన్ను గుండెలకు హత్తుకుంది. అక్కున చేర్చుకున్న వారు అమ్మ పొత్తిళ్లలోకి చేరుస్తారని చూస్తే.. వారేమో ఆస్పత్రిలోని గాజు అద్దాల మధ్య ఉంచారు. పక్షం రోజులు దాటాయి. నా అన్న వారెవరూ రాలేదు. ఇక్కడున్న నరుస(అ)మ్మలే నాకు దిక్కయ్యారు.

వారు విడతల వారీగా వచ్చి నా ఆలన చూస్తున్నారు. అయితే అమ్మపై దిగులుతో నేను గట్టిగా ఏడ్చినప్పుడు అటుగా వచ్చే పెద్ద డాక్టర్‌ పాప ఏడవకుండా చూడంటి అంటున్నాడు. ఆ పోలీసులు చూస్తే ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. వారొస్తే మా అమ్మానాన్నల్ని వెతికిపెడతారన్న ఆశ. ఇంకెన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచుతారో తెలియదు. ఇంకోరెండు రోజులుంటే నన్ను అనాథగా ముద్ర వేసి అమ్మకు దూరం చేస్తారేమో. మీరైనా పోలీసులకు చెప్పండి. నాకు అమ్మ కావాలి.’’
                                ఇట్లు ఓ పాప (పేరు పెట్టలేదు కాబట్టి)..
                                                                  కేరాఫ్‌.. ఇసుక దిబ్బలు..
పక్షం రోజుల క్రితం ఆస్పత్రిలోని ఇసుక దిబ్బల్లో లభ్యమైన పసికందు ఆవేదన ఇది. గత శనివారమే ఆస్పత్రి వైద్యాధికారులు పోలీసులకు సీసీ పుటేజీల్లో దృశ్యాలు చూసుకునేందుకు అనుమతిచ్చారు. ఇప్పటి దాకా పోలీసులు మాత్రం పాప ఎవరి తాలూకు అన్న విషయాన్ని నిర్థారించేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా