చింతూరు ఐటీడీఏ తొలి పీఓగా చినబాబు

4 Nov, 2016 22:28 IST|Sakshi
చింతూరు: 
స్థానిక ఐటీడీఏ తొలి ప్రాజెక్టు అధికారి (పీఓ)గా గుగ్గిలి చినబాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల ప్రజల సౌకర్యార్థం ఈ ఏడాది ఏప్రిల్‌లో చింతూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి రంపచోడవరం పీఓ కేవీఎ¯ŒS చక్రధరబాబు ఇ¯ŒSఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చినబాబు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ జనరల్‌గా, చింతూరు మండల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. చినబాబు మాట్లాడుతూ విలీన మండలాల ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు