రాజయ్య కుటుంబాన్ని సంపేయండి

6 Nov, 2015 10:13 IST|Sakshi
రాజయ్య కుటుంబాన్ని సంపేయండి

నా బిడ్డను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు
సారిక తల్లి లలిత
 

పోచమ్మమైదాన్ : సారికతో పాటు ఆమె కుమారుల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎంలో గురువారం పోస్టుమార్టం జరిగింది. ఈ సందర్భంగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సారిక తల్లి లలిత పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు.... రాజయ్య కుటుంబ సభ్యులే చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. రెండు కాన్పులు నేనే వెళ్లదీశాను. ఇద్దరు కవలలు కడుపులో ఉన్న సమయంలో నా బిడ్డకు సరిగా అన్నం కూడా పెట్టలే... మా బిడ్డ అత్త మాధవి వంట గదికి తాళం వేసుకుని వెళ్లేది. దీంతో బిడ్డ పస్తులు ఉండడం చూడలేక పక్కింటోళ్లే అన్నం పెట్టేటోళ్లు.. నా బిడ్డ లండన్‌లో ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సమయంలో అత్త, మామలకే మొత్తం డబ్బులు ఇచ్చేది. నా మొగుడు బాగుంటే చాలు అమ్మా... నాకు డబ్బులు ఎందుకు అని చెప్పేది. రాజ య్య ఎంపీగా ఉండి సైతం నా బిడ్డను పట్టించుకోలే... నా బిడ్డను అనిల్, మాధవి చిత్రహింసలు పెడుతుంటే పట్టించుకునే వారు కాదు.. రాజయ్య కు టుంబంను సంపేయండి... వారిని కఠినంగా శిక్షంచాలి.

నా బిడ్డ పడ్డ క్షోభ మరే బిడ్డ పడవద్దు... ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే... ఇంక ఎక్కడ జరగవు. నా ఇంటి నుంచే బియ్యం, పప్పులు, ఉప్పులు పంపేదాన్ని... బతుకమ్మ పండగకు వచ్చింది.... దస రా అయ్యాక వెళ్లింది.. ఏమైనా బాధ ఉంటే చెప్పమ్మా అంటే.. నా హక్కులు నేనే సాధిస్తా అని చెప్పింది. ఇం టిని మరో రెండు నెలల్లో ఇస్తారు కావచ్చు అని చెప్పింది నా బిడ్డ.... మళ్లీ ఎన్నికలు వచ్చాయి కదా ఎట్ల ఉంటదో... ఇస్తానంటాడో ఇవ్వనంటారో తెలి యదు.... పిల్లలకు ఫీజులు సైతం కట్టలేని పరిస్థితి ఉందని చెప్పడంతో నాది పేద కుటుంబమే అయినా బిడ్డ ఇబ్బంది పడొద్దని రూ.5వేలు ఇచ్చి పంపాను. నా భర్త లేవలేని స్థితిలో ఉన్నారు. నా మనువళ్లు ఎంతో ముద్దుగా ఉండేవారు... పండగకు వచ్చినప్పుడు అమ్మమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ అడుకున్నారు. నాకు అందరు ఆడపిల్లలే.... మనుమలనే కొడుకుల్లా భావించి అల్లాడుముద్దుగా చూసుకునేదాన్ని.. ఇప్పుడు మంటలు మాడిపోయారు..’ అం టూ లలిత రోదిస్తూ వెల్లడించింది.

 ‘సారికను చిత్రహింసలకు గురిచేశారు’
 ఎంజీఎం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులు సారికను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేశారని మహిళా సంఘాల నేతలు సదాలక్ష్మి, ఇంద్ర, సారమ్మ ఆరోపించారు. సారిక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన సమయంలో రూ.20 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని రాజయ్య కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆమె ఉద్యోగం చేస్తూ డబ్బు తెచ్చిన సమయంలో ఓ విధంగా, డబ్బులు ఇవ్వకుండా మరో విధంగా చూస్తూ చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు రాజయ్య కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు