చిత్తూరు జిల్లా ఎస్‌ఐ ‘అనంత’లో అరెస్టు

23 Apr, 2017 15:29 IST|Sakshi
చిత్తూరు జిల్లా ఎస్‌ఐ ‘అనంత’లో అరెస్టు

హిందూపురం అర్బన్‌ : చిత్తూరు జిల్లాలో ఎస్‌ఐగా పని చేస్తున్న శివకుమార్‌ను అనంతపురం జిల్లా హిందూపురం వన్‌టౌన్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ శనివారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నగీనాను ప్రేమించి పెళ్లిచూసుకుని మోసం చేశాడనే  ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కళాశాలలో చదివేటప్పటి నుంచి  ప్రేమించి, ఎస్‌ఐ ఉద్యోగం రాగానే కానిస్టేబుల్‌ను మోసం చేసేందుకు ప్రయత్నించగా అప్పట్లో పని చేసిన ఎస్పీ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత పెళ్లి చేశారు. ఆ తర్వాత కూడా అతనిలో మార్పు రాకపోగా, మరోపెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో బాధితురాలు గత డిసెంబర్‌లో హిందూపురం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎట్టకేలకు ఎస్‌ఐ శివకుమార్‌ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని ఎస్‌ఐ దిలిప్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు