సాయి మందిరంలో చోరీ

12 Sep, 2016 23:30 IST|Sakshi
దేవాలయం గేటు వద్ద పగులుగొట్టిన తాళం
సోంపేట: కొర్లాం గ్రామంలో 16వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిర ంలో  ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దేవాలయంలో బాబావారి వెండి పాదుకులు 500 గ్రాములు, వెండి కిరీటం 350 గ్రాములు, వెండి గ్లాసు 150 గ్రాములు కలిపి మొత్తం కిలో వెండి, నాలుగు నెలల హుండీలోని నగదు సుమారు రూ. 8 వేలు చోరీ జరిగినట్టు తెలిపారు. ఆలయ అర్చకుడు  ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేసి వెళ్లి పోయారని, సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి తాళాలు పగులు గొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త పెద్దింటి యర్రయ్య ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్ఛాపురం సీఐ అవతారం, సోంపేట ఎస్‌ఐ భాస్కరరావు, శ్రీకాకుళం క్లూస్‌ టీం దేవాలయాన్ని పరిశీలించి, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అంతరాష్ట్ర దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు