సింహవాహనంపై చౌడేశ్వరీ అమ్మవారు

18 Apr, 2017 00:24 IST|Sakshi

అమడగూరు (పుట్టపర్తి) : మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా సింహవాహన ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమాన్ని ఎప్పటి లాగానే కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులు ఆర్భాటంగా నిర్వహించారు. శివశంకర్‌రెడ్డి రథసారథిగా చౌడేశ్వరమ్మను పూలపల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం నుంచి ఊరేగిస్తూ గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వద్దకు తీసుకెళ్లి భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. ధగ ధగ మెరిసే నగలతో, పట్టు వస్త్రాలతో అభయమిస్తున్నట్లు కనిపిస్తున్న చౌడేశ్వరిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్కల భజనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ చలపతి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం హంసవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పార్వతమ్మ, రాఘవరెడ్డి, అనూష, నిర్మలమ్మ, సుగుణమ్మ, అరుణమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా