అభయ గోల్డ్ కేసు: ముగిసిన సీఐడీ దర్యాప్తు

6 Nov, 2016 14:08 IST|Sakshi

విజయవాడ: ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అభయగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తయింది. రేపు (సోమవారం) కోర్టులో సీఐడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. అభయ గోల్డ్ వ్యవహారంపై దాదాపు 10 వేల పేజీలతో చార్జ్‌షీట్ తయారుచేసినట్లు సమాచారం. ఈ చార్జ్‌షీట్ ప్రకారం 26 మంది నిందితులపై అభియోగ పత్రం నమోదుచేశారు. ఈ కుంభకోణంలో మొత్తం రూ.170 కోట్ల మేర మోసం జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు