పోరాటయోధుడు బీబీ నాయుడు

19 Feb, 2017 01:16 IST|Sakshi
పోరాటయోధుడు బీబీ నాయుడు
వందలాది మందితో అంతిమ యాత్ర  
కోటిలింగాలపేటలో దహన సంస్కారాలు
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికోద్యమ నేత, సీఐటీయు నాయకుడు బీబీ నాయుడు చూపిన బాటలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నడవాలని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మూత్ర పిండాల వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సీఐటీయూ నాయకుడు బీబీ నాయుడు భౌతిక కాయానికి శనివారం మధ్యాహ్నం కోటిలింగాల పేట కైలాస భూమిలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న బీటీఆర్‌ భవ¯ŒS నుంచి బీబీ నాయుడు భౌతిక కాయానికి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన యాత్ర పేపరుమిల్లు మీదుగా నందం గనిరాజు జంక్షన్, జాంపేట, గణేష్‌చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్‌ మీదుగా కోటిలింగాల పేట కైలాస భూమికి చేరుకుంది. మధ్యాహ్నం   దహన సంస్కారాలు పూర్తయ్యాయి.
ప్రముఖుల నివాళి
ఎర్ర జెండా పట్టుకుని అదే జెండా కింద నిబద్ధతతో నడిచిన బీబీ నాయుడు బాటలో అంతా నడవాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. నాయుడు మృతి కార్మిక లోకానికి తీరనిలోటన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణే ఊపిరిగా బీబీనాయుడు బతికారని మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మిడియం బాబూరావు అన్నారు. కుల రహిత సమాజం కోసం అంతా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకరచౌదరి సూచించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, సీసీసీ ఛానల్‌ ఎండీ పంతం కొండలరావు, సీపీఎం అర్బ¯ŒS జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, బయ్యా జోసఫ్, ట్రేడ్‌ యూనియ¯ŒS నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, డి.శేషుబాబ్జీ మాట్లాడారు.
మరిన్ని వార్తలు