పుష్కరాలకు సిటీ సర్వీసులు

13 Aug, 2016 00:33 IST|Sakshi
పుష్కరాలకు సిటీ సర్వీసులు
 
పెనమలూరు : 
ఆర్టీసీ అధికారుల నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు మిగిల్చింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రికుల సౌకర్యార్థం ఘాట్‌లకు ఉచితంగా బస్సులను నడపాలని నిర్ణయించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన శాటిలైట్‌ స్టేషన్‌కు బస్సులను పెద్దసంఖ్యలో తరలించారు. ఉదయాన్నే వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సిటీ బస్సులు గ్రామాల్లోకి రాక పోవటంతో బస్సులు వస్తాయో రావో తెలియక గందరగోళానికి గురయ్యారు. బందరు రోడ్డుపై సిటీ బస్సులు కొన్ని సర్వీసులే తిరగటంతో చాలా సమయం ప్రజలు బస్టాపుల వద్ద సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. గ్రామాలకు రావాల్సిన సిటీ బస్సులు తిరిగి వెంటనే తిప్పాలని ప్రజలు కోరుతున్నారు.  పెనమలూరు గ్రామం వరకైనా సిటీ బస్సులు ఎక్కువగా తిప్పాలని ప్రజలు తెలిపారు.
ఖాళీగా తిరిగిన బస్సులు
పుష్కరాలకు తొలిరోజు యాత్రికులు తక్కువగా హాజరయ్యారు. ఉచిత బస్సులు యాత్రికులు లేక ఖాళీగా తిరిగాయి. కొన్ని బస్సులను శాటిలైట్‌ బస్‌స్టేçÙన్‌లోనే ఉంచారు. గ్రామాలకు వెళ్లాల్సిన సిటీ బస్సులు ఇలా నిరుపయోగంగా శాటిలైట్‌ బస్‌స్టేçÙన్‌లో ఉంచటం వలన అందరికి ఇబ్బందులు తలెత్తాయి.  
యాత్రికులు లేని సర్వీసులు 
ఉయ్యూరు : పుష్కరాల తొలి రోజు యాత్రికుల రద్దీ కనిపించలేదు. ఉయ్యూరు ఆర్టీసీ డిపో నుంచి తోట్లవల్లూరు మండలంలోని తోట్లవల్లూరు, ఐలూరు పుష్కర ఘాట్లకు ప్రత్యేకంగా ఉచిత సర్వీసులను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సర్వీసులు నడిపారు. ఏ సర్వీసులోనూ పట్టుమని పది మంది కూడా కనిపించలేదు. వరలక్ష్మీ శుక్రవారం కావటం, ఆయా ఘాట్లలో నీరు లేకపోవడంతో యాత్రికులు ఆసక్తి కనబర్చలేదు.
 
మరిన్ని వార్తలు