ప్రజా పంపిణీ 81.47 శాతం పూర్తి

15 May, 2017 22:49 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో మే నెలకు సంబంధించి ప్రజాపంపిణీ కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా 11,48,970 రేషన్‌ కార్డులు ఉన్నాయి. రాత్రి 8 గంటల çసమయానికి 9,36,092 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,75,525  కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. ఏప్రిల్‌  నెలతో పోలిస్తే మే నెలలో నగదు రహితంపై సరుకుల పంపిణీ కొంత వరకు పెరిగింది. సంజామల మండలంలో అత్యధికంగా 64.01శాతం, బేతంచెర్ల మండలంలో 60.81 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి.  అతి తక్కువగా ప్యాపిలి మండలంలో కేవలం 2.931శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు.
 
>
మరిన్ని వార్తలు