ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం

12 Dec, 2016 14:55 IST|Sakshi
ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం
పాత గుంటూరు: గాయత్రీ మహిళా çసంగీత సన్మండలి ఆధ్వర్యంలో బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠపాలిట ఓంకార క్షేత్రంలో ఆదివారం శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్‌ ఎ.వి.దక్షిణామూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్‌ బండ్లమూడి సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూజివీడుకు చెందిన బి.విద్యాసాగర్‌ గాత్రం చేయగా విజయవాడ హేమాద్రి చంద్రకాంత్‌ వయోలిన్, గుంటూరుకు చెందిన బి.సురేష్‌బాబు మృదంగంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని కె.ఆర్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణ నిర్వహించారు.
మరిన్ని వార్తలు