ఖైదీలకు ఏపీ సర్కార్ క్షమాభిక్ష

18 Nov, 2015 19:50 IST|Sakshi

విజయవాడ: సత్‌ప్రవర్తన కలిగి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు గణతంత్ర దినోత్సవం రోజున క్షమాభిక్ష పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపోందిస్తూ జీవో నెం 163ను బుధవారం విడుదల చేసింది. 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన మహిళలు, పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన పురుషులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది.

65 సంవత్సరాల పైబడి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన వృద్ధులకు క్షమాభిక్ష పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్షమాభిక్షకు 20 నుంచి 25 సంవత్సరాల శిక్ష పడిన వారు అనర్హులు. అర్హులైన ఖైదీలను గుర్తించేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన  ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
 

మరిన్ని వార్తలు