పుష్కర సంబరం..

11 Aug, 2016 21:43 IST|Sakshi
పుష్కర సంబరం..
  • ముగిసిన అంత్యపుష్కరాలు
  • చివరిరోజు భక్తుల తాకిడి
  • ధర్మపురి 40వేలు, కాళేశ్వరంలో 10వేల మంది పుష్కరస్నానం
  • ధర్మపురి/కాళేశ్వరం/ ౖయెటింక్లయిన్‌కాలనీ: 12 రోజులపాటు జరిగిన అత్యపుష్కరాలు వైభంగా ముగిశాయి. కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల, మంథని, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. చివరిరోజు మహాహారతి వైభంగా నిర్వహించి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ధర్మపురి గోదావరిలో గురువారం 40వేలమంది పుణ్యస్నానం చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ఐదువేల మందికి అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఆంధ్రాబ్యాంక్‌ డెప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శివానందశేషగిరి రావు,  సీసీఎల్‌ఏ కార్యదర్శి కె. కష్ణ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో నిర్వహించిన ప్రత్యేక గంగాహారతి కార్యక్రమానికి చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో అంత్యపుష్కరాలు వైభవంగా జరిగాయి. 12 రోజులపాటు వివిధ ప్రాంతాలనుంచి లక్షా 50వేలమంది పుష్కర స్నానాలు ఆచరించారు. చివరి రోజు 10వేలకు పైగా స్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక శ్రావణమాసపు పూజలు నిర్వహించారు. మహిళలు గోదావరిమాతకు మహిళలు దీపారాధన, లక్షవత్తులు వెలిగించారు. శుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. చివరిరోజు పూజల్లో మంథని ఆర్డీవో బాల శ్రీనివాస్, సర్పంచ్‌ మాధవి, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనభాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు పాల్గొన్నారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహించారు. 12రోజులకు కాళేశ్వరం దేవస్థానానికి రూ.11.20లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో డి.హరిప్రకాశ్‌రావు తెలిపారు. కమాన్‌పూర్‌ మండలం సుందిళ్ల గ్రామ పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది.
     
     
     
     
మరిన్ని వార్తలు