నేడు జిల్లాకు సీఎం రాక

19 May, 2017 02:11 IST|Sakshi
నేడు జిల్లాకు సీఎం రాక

మూడు రోజుల పాటు పర్యటన
రేపు పలు కార్యక్రమాలకు హాజరు
ఎల్లుండి తిరుమల సందర్శన


చిత్తూరు కలెక్టరేట్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న గురువారం ప్రకటించారు.
   
శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సీఎం పుత్తూరులోని సిద్ధార్థ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొంటారు.
7.30 గంటలకు తనపల్లె క్రాస్‌ వద్ద రామానాయుడు కల్యాణమండపంలో జరిగే వివాహ వేడుకకు హాజరవుతారు.
8 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బస
శనివారం ఉదయం 9.30 గంటలకు పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లెలో పంట సంజీవని ఫాం ఫాండ్లను పరిశీలిస్తారు.
10.35 గంటలకు రొంపిచెర్ల మండలం నగరి దళితవాడలో  నిర్మించిన పక్కాగృహాలు, మరుగుదొడ్లు తదితరాలను పరిశీలిస్తారు. సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. 11.15 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్వీయూలోని లైబ్రరరీ బ్లాక్‌ వద్ద అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీనివాస ఆడిటోరియంలో నీరు – ప్రగతి శిక్షణలో పాల్గొంటారు.
శ్రీపద్మావతి అతిథి గృహంలో రాత్రిబస
ఆదివారం ఉదయం 11 గంటలకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు.
3.10 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడకు బయలుదేరుతారు.

మరిన్ని వార్తలు